తెలంగాణ

telangana

ETV Bharat / state

TS prisons department : తెలంగాణ జైళ్లశాఖకు 6 బంగారు పతకాలు - TS prisons department wins six gold medals

TS prisons department wins six gold medals : ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుతో పాటుగా ఎన్నో అవార్డులు పొందింది తెలంగాణ పోలీసు విభాగం. తాజాగా అఖిల భారత ఆరో ‘ప్రిజన్‌ డ్యూటీమీట్‌-2022’లో తెలంగాణ జైళ్లశాఖ సత్తా చాటింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన పోటీల్లో 6 బంగారు పతకాలతో తొలిస్థానంలో నిలిచింది. విజేతలకు గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవదత్‌ పురస్కారాల్ని అందజేశారు.

Telangana prisons department wins six gold medals
తెలంగాణ జైళ్లశాఖ

By

Published : Sep 7, 2022, 6:54 AM IST

TS prisons department wins six gold medals: అఖిల భారత ఆరో ‘ప్రిజన్‌ డ్యూటీమీట్‌-2022’లో తెలంగాణ జైళ్లశాఖ సత్తా చాటింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన పోటీల్లో 6 బంగారు పతకాలతో తొలిస్థానంలో నిలిచింది. ఒక వెండి, రెండు కాంస్య పతకాలతోపాటు 4 ట్రోఫీలను సైతం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో 19 రాష్ట్రాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ జైళ్లశాఖ తరఫున 11 మంది అధికారులు, 64 మంది సిబ్బంది హాజరయ్యారు. వీరికి వరంగల్‌ కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి సంపత్‌ నేతృత్వం వహించారు. మంగళవారం జరిగిన ముగింపు ఉత్సవంలో విజేతలకు గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవదత్‌ పురస్కారాల్ని అందజేశారు. తెలంగాణ విజేతలను రాష్ట్ర జైళ్లశాఖ డీజీ జితేందర్‌, ఐజీ రాజేశ్‌ అభినందించారు.

పోటీలు.. బంగారు పతక విజేతలు..

  • బిజినెస్‌ ప్రిజన్‌ మోడల్‌: సూపరింటెండెంట్‌ సంపత్‌
  • ఫస్ట్‌ఎయిడ్‌: రాజ్‌కుమార్‌ (డిప్యూటీ జైలర్‌)
  • బెస్ట్‌ ప్రాక్టీసెస్‌: శ్రీమాన్‌రెడ్డి (జైలర్‌), భరత్‌ (డిప్యూటీ సూపరింటెండెంట్‌)
  • కరాటే (వ్యక్తిగతం): కూర్మారావు, పరాశరన్‌
  • క్రావ్‌ మగా (బృందం): రత్నం (జైలర్‌), మోహన్‌ (వార్డర్‌), కాశీశ్వరబాబు (వార్డర్‌)
  • కరాటే (బృందం): రత్నం (జైలర్‌), కాశీశ్వరబాబు (వార్డర్‌), మోహన్‌ (వార్డర్‌)

ABOUT THE AUTHOR

...view details