ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహకానికి ఎంతగానో కృషిచేస్తున్నామని రాష్ట్ర క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్-3 ట్రోఫీని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. టీపీకేఎల్ సీజన్-3 పోటీలు ఈ నెల 22 నుంచి మార్చి14 వరకు హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగనున్నాయి. రాష్ట్ర సంస్కృతిలో కబడ్డీని ప్రాచీన క్రీడాగా మంత్రి అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రోత్సాహం అందిస్తునామన్నారు.
ప్రీమియర్ కబడ్డీ సీజన్-3 ట్రోఫీని ఆవిష్కరించిన క్రీడా మంత్రి - కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం
తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్-3 ట్రోఫీని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. సీజన్-3 పోటీలు ఈ నెల 22 నుంచి మార్చి 14 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనున్నాయి.
యువత చదువుతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు. ఈ సీజన్లో పాల్గొంటున్న జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా శాఖ తరుఫున అవసరమైన సహాయ, సహకారాన్ని అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కన్వీనర్ సంజయ్ రెడ్డి, రంగారెడ్డి టీమ్ అధినేత శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఐపీఎల్ ప్రోమో కాపీ కొట్టిన పాకిస్థాన్ సూపర్ లీగ్!