PRC Commission for Govt Employees : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కోసం ప్రభుత్వం సంఘాన్ని ఏర్పాటు చేసింది. పీఆర్సీ(Telangana PRC) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వేతనసవరణ సంఘం ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్‌ను నియమించారు. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.రామయ్యను కమిషన్‌లో సభ్యునిగా నియమించారు. ఈ మేరకు పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Electricity Employees PRC: విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
KCR Confirms PRC Commission :వేతనసవరణ సంఘం ఆరు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతలు నిర్వర్తించేందుకు పీఆర్సీకి కావాల్సిన నిధులు, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థికశాఖను ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు శాతం మధ్యంతర భృతిని కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
TS PRC Commission :పీఆర్సీ నియమించిందుకు సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో(TNGO) నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యంతర భృతి కూడా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిజేశారు. త్వరలో కేసీఆర్‌ను కలిసి సమస్యలన్నింటిని పరిష్కరించాలని కోరుతామని టీఎన్జీవో నేతలుపేర్కొన్నారు. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను కూడా విడుదల చేయాలని కోరారు.