BRS Ministers fires on Congress :రాష్ట్రంలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుడటంతో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలపై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన 'పవర్ పాలిటిక్స్'అంశం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా బీఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఆ పార్టీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తిప్పికొట్టారు.
BRS on Congress Free Power Cancel Comments :ఉచిత విద్యుత్‌పై జాతీయస్థాయిలో కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడి కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందని ఎద్దేవా చేశారు. రేవంత్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విజ్ఞత చూపాలని అమాత్యులు సూచించారు. రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలన్న మంత్రులు... పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం గాలిలో దీపమేనని విమర్శించారు. నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ నేతల కడుపు మండుతోందని ఆక్షేపించారు.
Niranjan Reddy fires on Congress : కాంగ్రెస్ పాలనలో 9 గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆ ఇచ్చిన 9 గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ కూడా కీలకమైన అంశంగా పేర్కొన్న నిరంజన్‌రెడ్డి... గతంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ విద్యుత్ అంశంపై లేఖ రాశారన్నారు. చరిత్ర తెలియని వారు.. చరిత్రలో భాగస్వామ్యం లేని వారు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. విద్యుత్ అంశంపైనే చంద్రబాబుతో కేసీఆర్ విభేదించారని పేర్కొన్నారు. కరెంటు కష్టాలు, తాగునీటి సమస్యపైనే తెలంగాణ మలిదశ ఉద్యమం వచ్చిందని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
'తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మెుదటి స్థానంలో ఉంది. ఇవాళ తెలంగాణ.. దేశంలోనే విద్యుత్ మిగులు ఉన్న రాష్ట్రం. విద్యుత్ సమస్యతో ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పని కూడా ఆగట్లేదు. 24 గంటల విద్యుత్‌ను గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించలేదు. 24 గంటల విద్యుత్ ఇస్తే నేనే మీ తరపున ప్రచారం చేస్తానని అప్పట్లో జనారెడ్డి అన్నారు. కొందరు సబ్‌స్టేషన్ల వద్దకు వెళ్లి గంటో.. అరగంటో లేదని లెక్కలు చూపుతున్నారు. సాంకేతిక సమస్యలతో గంటో.. అరగంటో అంతరాయం రాదా? విద్యుత్ కొనుగోళ్లు అన్నీ ఆన్‌లైన్‌లో సాగుతాయి. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి అని మాట్లాడటం అవివేకం.' - నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి