రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కూర్చుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరిద్దామని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ధర్మాధికారి నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి... ఆ నివేదికను యథావిధిగా అమలు చేద్దామన్నారు. కొంతమంది ఏపీ ఉద్యోగులు నివేదికను పూర్తిగా చదవకుండానే ఇక్కడకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ యాజమాన్యం ఏకపక్షంగా రిలీవ్ చేసిన ఉద్యోగులను మేం తీసుకోబోమని సీఎండీ తేల్చి చెప్పారు.
'ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులను తీసుకోలేం' - విద్యుత్ సౌధా వద్ద తెలంగాణ విద్యుత్ నిరాహార దీక్ష
ధర్మాధికారి నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యకు పరిష్కారం కనుగొందామని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. కొంతమంది ఏపీ ఉద్యోగులు నివేదికను పూర్తిగా చదవకుండానే ఇక్కడకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అటువంటి వారిని తీసుకోలేమని స్పష్టం చేశారు.
'మీరూ మేము కలిసి కూర్చొని సమస్యను పరిష్కరిద్దాం'
ఆంధ్రప్రదేశ్ వాళ్లు కావాలని సమస్య సృష్టించారంటూ తెలంగాణ ఉద్యోగులు విద్యుత్ సౌధాలో చేపట్టిన నిరాహార దీక్ష నేటితో రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు ఏపీ విద్యుత్ ఉద్యోగులు కొంతమంది విధుల్లో చేరేందుకు విద్యుత్ సౌధకు రాగా తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఇవీ చూడండి:ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు