తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మా మద్దతు: టీఎస్‌పీఈఏ

నూతన విద్యుత్ యాక్ట్ ద్వారా లైసెన్సు లేకున్నా పంపిణీ చేయవచ్చని... ఫలితంగా ప్రైవేటు మాఫియా ఏర్పడుతుందని టీఎస్‌పీఈఏ అధ్యక్షుడు రత్నాకర్ తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రోజే సమ్మె చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

By

Published : Mar 10, 2021, 5:55 PM IST

telangana-power-employees-association-president-ratnakar-meet-about-new-power-bill-in-hyderabad
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మా మద్దతు: టీఎస్‌పీఈఏ

పార్లమెంట్‌లో విద్యుత్ సవరణ బిల్లు -2021ని ప్రవేశపెట్టిన రోజు తాము సమ్మె చేస్తామని రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రోజే మెరుపు సమ్మె నిర్వహించాలని జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయించిందని అన్నారు. సోమాజిగూడలోని టీఎస్‌పీఈఏ కార్యాలయంలో వివిధ విద్యుత్ సంఘాల నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

నూతన విద్యుత్ యాక్ట్ ద్వారా లైసెన్సు లేకున్నా పంపిణీ చేయవచ్చని... ఫలితంగా విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రైవేటు మాఫియాగా ఏర్పడుతాయని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల ఛార్జీలు పెంచే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం అన్ని విషయాల్లో అండగా ఉందని... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 14,15 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నవారికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శివరాత్రి జరుపుకోండి: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details