Telangana Power Dues Issue :ఆంధ్రప్రదేశ్‌కి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ.. గతేడాది కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ..తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు పిటిషన్లు దాఖలుచేశాయి. ఆ పిటిషన్లపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం 65 పేజీల తీర్పు వెలువరించింది. వివాదం.. రెండు రాష్ట్రప్రభుత్వాల నియంత్రణలో ఉన్న సంస్థలకు సంబంధించినదన్న హైకోర్టు.. సామరస్యపూర్వకంగా ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం అవసరమని అభిప్రాయపడింది.
Telangana AP Electricity Dues Issue :వివాదాలు వస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం తొలుత చర్చలతో.. ఆ తర్వాత ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. అందుకు ఏపీ ఈఆర్సిని సంప్రదించవచ్చని ఉంది. అంటే రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య.. తలెత్తే వివాదాల పరిష్కరానికి ప్రత్యామ్నాయ సంస్థ ఉన్నట్లే కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాద పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ సంస్థను ఆశ్రయించకుండా.. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 92 కింద నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిందని పేర్కొంది.
Telangana HC On AP Telangana Electricity Dues :చట్టప్రకారం బకాయి ఉన్నట్లు తెలంగాణ అంగీకరించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే వివదాల పరిష్కారం కోసం సబ్‌కమిటీ ఏర్పాటుకాగా 2022 ఫిబ్రవరి 17న సమావేశం జరిగిందని పేర్కొంది. పాక్షిక వివాదాల పరిష్కారానికి అంగీకరించబోమని.. పూర్తిస్థాయి పరిష్కారానికే అంగీకరిస్తామని తెలంగాణ తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అదే ఏడాది జూన్17 నాటి సమావేశంలోనూ బకాయిలను.. తెలంగాణ అంగీకరించలేదని పేర్కొంది.
DISCOM Payment Dues : బకాయిలు చెల్లించకుంటే డిస్కంలకు విద్యుత్ సరఫరా బంద్..!
Extra Power charges: వినియోగదారులకు విద్యుత్ షాక్.. రెండింతల బిల్లు వచ్చిందని ఆవేదన