తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు అలర్ట్ - వచ్చే ఏడాది నుంచి పాలిటెక్నిక్‌కు కొత్త సిలబస్‌ - New Syllabus for Polytechnic Students

Telangana Polytechnic New Syllabus : రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి.. పాలిటెక్నిక్‌లో నూతన సిలబస్‌ అమల్లోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ మండలి.. 24 కమిటీలతో కసరత్తు షురూ చేసింది. వివిధ రాష్ట్రాలు, దేశాల్లోని పాలిటెక్నిక్‌ పాఠ్య ప్రణాళికలపై.. ఈ కమిటీలు పరిశీలన చేయనున్నాయి.

Telangana Polytechnic
Telangana Polytechnic

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 11:36 AM IST

Telangana Polytechnic New Syllabus : తెలంగాణలో పాలిటెక్నిక్‌ (Telangana Polytechnic) విద్యకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి కొత్త సిలబస్‌ అమలు కానుంది. తొలిసారిగా విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను కూడా పరిశీలించి.. వచ్చే ఐదేళ్ల కోసం నూతన సిలబస్‌ను రూపొందించనున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్‌/జులైలో ప్రారంభమయ్యే పాలిటెక్నిక్‌ తొలి సంవత్సరం విద్యార్థులకు కొత్త పాఠ్య ప్రణాళిక అమలు కానుంది.

New Syllabus in Telangana Polytechnic : ఇందుకోసం తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌).. ఇటీవలే ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీ చొప్పున మొత్తం 24 కమిటీలను నియమించింది. ఒక్కో కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. అందులో ముగ్గురు పాలిటెక్నిక్‌ నిపుణులు కాగా.. ఎన్‌ఐటీ, ఐఐటీల నుంచి ఇద్దరు.. పారిశ్రామిక రంగాలకు చెందిన ఓ నిపుణుడు ఉన్నారు. ఈ కసరత్తు అంతా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎస్‌బీటెట్‌ ఛైర్మన్‌ అయిన వాకాటి కరుణ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్​ జాబ్స్​- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

ఈ సిలబస్‌ 2028-29 విద్యాసంవత్సరం వరకు అమల్లో ఉండనుంది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఏటా సుమారు 34,000 మంది విద్యార్థులు డిప్లొమా కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. కమిటీల సభ్యులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్‌ సిలబస్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లోని ప్రముఖ డిప్లొమా కోర్సులను అందించే విద్యాసంస్థల సిలబస్‌లను కూడా అధ్యయనం చేసి అవసరమైన అంశాలను చేరుస్తారు.

New Syllabus in Polytechnic Students : జర్మనీ, అమెరికా, సింగపూర్‌, చైనా తదితర 24 దేశాల్లోని.. సిలబస్‌లను ఆయా కమిటీలు పరిశీలన చేస్తున్నారు. పాలిటెక్నిక్‌ విద్యలో ఆన్‌లైన్‌ మూల్యాంకనం,ఓపెన్‌బుక్‌, ఇంటర్న్‌షిప్‌ విధానం.. తదితర ఎన్నో వినూత్న సంస్కరణలను అమలు చేయడంలో ఎస్‌బీటెట్‌ ఇప్పటికే ముందజలో ఉంది. సిలబస్‌లోనూ ఆదర్శంగా ఉండాలన్న సంకల్పంతో.. ఇతర దేశాల పాఠ్య ప్రణాళికలను (New Syllabus in Polytechnic) కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ACIO పోస్టులు - అప్లై చేసుకోండిలా!

మార్చి 15 నాటికి సిద్ధం :కొత్త పాఠ్య ప్రణాళికను మార్చి 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఎస్‌బీటెట్‌ కార్యదర్శి ఆకూటి పుల్లయ్య తెలిపారు. అందుకు అనుగుణంగా కమిటీ భేటీలు, కార్యశాలలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2024లో పాలిటెక్నిక్‌లో చేరే విద్యార్థులు కొత్త సిలబస్‌ను చదవాల్సి ఉంటుందని వివరించారు. అప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివేవారికి పాత సిలబస్‌ ఉంటుందని అన్నారు. మొత్తం 58 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు గాను.. 28 కళాశాలల్లోని పలు కోర్సులకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు సాధించి దేశంలో ముందంజలో ఉన్నామని ఆకూటి పుల్లయ్య వెల్లడించారు.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి మోడల్‌ కరిక్యులమ్‌ ప్రకారం సిలబస్‌ను, ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆకూటి పుల్లయ్య వివరించారు. గతంలో ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు ఓపెన్‌బుక్‌ విధానం అమలు చేయగా ప్రస్తుత విద్యాసంవత్సరం ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టుకు కూడా అమలు చేస్తున్నట్లు ఆకూటి పుల్లయ్య తెలిపారు.

బీటెక్ విద్యార్థులకు గుడ్​న్యూస్​- BELలో ఇంజినీర్​​ ఉద్యోగాలు, అప్లైకు కొద్ది రోజులే ఛాన్స్​!

NLCలో 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details