Telangana Political Parties Speedup in Election Campign :సికింద్రాబాద్.. సనత్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్‌లోని పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి బస్తీలల్లో పాదయాత్ర చేస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ... ఓట్లు అభ్యర్థించారు.
ఆట పాటల మధ్య సందడిగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం
ఖైరతాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్‌కుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట్‌లోని పలుగ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజుల రామారంలోని బీజేపీ కార్యాలయంలో వడ్డెర సంఘం అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Election Campaign in Hyderebad :ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి కమలా సుధీర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. పాతబస్తీ యాకత్ పురా నియోజక వర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రషీద్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అవినీతి పాలన అంతం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి : ఈటల
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ.. ములకలపల్లి మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి అశ్వరావుపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాగమయి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Political Heat in Telangana :పాలేరు నియోజకవర్గంలోని ఈదుల చెరువులో అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామానాగేశ్వరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌తో కలిసి జిలేబీ వేస్తూ ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 60వ డివిజన్‌లో ప్రజాదీవెన యాత్ర పేరుతో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.