తెలంగాణ

telangana

ETV Bharat / state

మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్ - hyderabad today news

తప్పిపోయాడనుకున్న పిల్లాడు.. దొరికితే ఆ తల్లిదండ్రుల్లో కలిగే ఆనందం వర్ణించలేం. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్​ స్టేషన్​లో చోటుచేసుకుంది. తప్పిపోయిన పసివాణ్ణి వెతికి పట్టుకున్నారు. తల్లిదండ్రులకు తెలిపారు. పీఎస్​కు వచ్చిన ఆ తల్లి కొడుకును ఆప్యాయంగా పట్టుకుని ఆనందంతో ఏడ్చేసింది.

Telangana Police who solved the Missing Case at hyderabad
మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్

By

Published : Jan 9, 2020, 12:32 PM IST

దర్పణ్ ఇది తెలంగాణ పోలీసులు తెచ్చిన ప్రత్యేక ఆపరేషన్. దీని ద్వారా మిస్సింగ్ కంప్లైంట్లలో తప్పిపోయిన పిల్లల్ని వెతికి కనిపెట్టి తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఇలా ఇప్పటికే వందల మందిని అప్పగించారు. తాజాగా తమ కొడుకు తప్పిపోయాడని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వగానే తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పిల్లవాడి వివరాలన్నీ తెలుసుకొని ఆచూకీ కోసం గాలించారు.

ఆ క్రమంలో కుషాయిగూడ పోలీసులు ఓ పిల్లాణ్ని చూశారు. తాము వెతుకుతున్నది ఆ పిల్లాడినేనా అన్న డౌట్ వారికి వచ్చింది. దానితో ఫేస్​ రికగ్నేషన్ టూల్ ఉపయోగించి పిల్లాణ్ని గుర్తించారు. స్టేషన్‌కి తీసుకెళ్లి తల్లిదండ్రులకు ఫోన్​ చేశారు.

ఎంతో ఆతృతగా వచ్చిన ఆ తల్లిదండ్రులు పిల్లాణ్ని చూసి ఆనందంతో హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. తన బిడ్డను తమ వద్దకు చేర్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎస్​ అధికారిణి స్వాతి లక్రా ఆ విషయానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‍‌లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌ని లైక్ చేశారు.

మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్

ఇదీ చూడండి : కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details