ఏటా విత్తనాల సీజన్లో నకిలీ విత్తనాల తయారీదారులపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ వరుస దాడులు నిర్వహిస్తోంది. వీటితో పాటు వ్యవసాయ అధికారుల సహాయంతో నకిలీ విత్తనాలను గుర్తిస్తూ పోలీసులు నిందితులపై పీడీయాక్ట్ ప్రయోగిస్తోంది. 2014 నుంచి ఈ కేసుల్లో 13 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. త్వరలో ఖరీఫ్ రానుండగా.. నకిలీ దందాపై ప్రత్యేక దృష్టి సారించారు.
మరింత కఠినంగా..
ఈ ఏడాది ఇప్పటివరకూ 7 ఘటనల్లో 65 మందిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ సారి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, రామగుండం కమిషనరేట్లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
కమిషనరేట్లు | కేసులు |
కుమురంభీం ఆసిఫాబాద్ | 75 |
నల్గొండ | 59 |
రామగుండం | 72 |