Home Minister Special Operation Medal: రాష్ట్రానికి చెందిన 13 మంది పోలీసు అధికారులకు హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్‌కు ఎంపిక చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎంపికైన వారిలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్‌తో పాటు డీఎస్పీ కె.రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు గౌడ్, నలుగురు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలిపింది.
ఆ 13 మందికి కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ - కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా వార్తలు
Home Minister Special Operation Medal: రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు అధికారులకు హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్‌కు ఎంపికయ్యారు. రాష్టానికి చెందిన 13మంది అధికారులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవం అయిన అక్టోబర్ 31న కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ మెడల్స్ ప్రకటిస్తోంది.
Police
ప్రతి సంవత్సరం సర్దార్ వల్లబయ్ పటేల్ జయంతిని పురష్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం అయిన అక్టోబర్ 31న ఈ అవార్డులను ప్రకటిస్తోంది. గత నాలుగేళ్లుగా తీవ్రవాదం, సరిహద్దు రక్షణ, సరిహద్దు రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేసిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ఇస్తోంది.
ఇవీ చదవండి: