Mask Fine: రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఆంక్షలు కఠినతరం చేసిన సర్కారు... వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రతిఒక్కరూ మాస్క్ తప్పకుండా ధరించాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి... నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారికి జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో...
10 రోజుల్లో గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 34 వేల కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పరిధిలో 19వేల650, సైబరాబాద్ పరిధిలో 12వేల785, రాచకొండ పరిధిలో 18వందల 41 కేసులు నమోదు చేశారు. మాస్కులేకుండా వెళ్తున్న వారిపై ఒక్కొక్కరికి వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు... మాస్క్ లేకుండా వెళ్తున్నవారి ఫొటోలు తీసి ఇంటికి ఈ-చలానాలను పంపిస్తున్నారు.