తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుంది.. బయటి నుంచే సేవచేస్తా: వీకే సింగ్ - తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌ తాజా వార్తలు

తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ పదవికి సీనియర్‌ ఐపీఎస్ అధికారి వీకే సింగ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపారు. గత కొంత కాలంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

Telangana Police Academy Director VK Singh 'resigns'
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌ వీ.కే.సింగ్ 'రాజీ'నామా

By

Published : Jun 24, 2020, 10:37 PM IST

సీనియర్‌ ఐపీఎస్ అధికారి వీకే సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గాంధీ జయంతి రోజున పదవీ విరమణ ఇవ్వాలని వీకే సింగ్‌ కేంద్రాన్ని కోరారు. పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు తేవాలనే ఆశయం తనకు ఉండేదన్నారు. సంస్కరణల అమలులో సఫలం కాలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. తన సర్వీస్‌ పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుందని వీకే సింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి తాను భారం కాదల్చుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమన్నారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details