తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ పిండివంటలు... అదిరే రుచులు - తెలంగాణ సంప్రదాయ రుచులు

అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు, సకినాలు, లడ్డూలు పేర్లు వింటుంటేనే నోరూరుతోంది కదా. వీటిని భాగ్యనగరవాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచేలా పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. తద్వారా చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్​ ట్యాంక్​బండ్​లోని హరిత రెస్టారెంట్​లో స్టాల్స్​ను పర్యాటక శాఖ ఛైర్మన్​ ప్రారంభించారు.

తెలంగాణ రుచులు

By

Published : Jun 20, 2019, 3:20 PM IST

తెలంగాణ సంప్రదాయ రుచుల స్టాళ్లు ఏర్పాటు

తెలంగాణ పిండివంటకాలైన అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు వంటి రుచులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా రాష్ట్ర పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్​ ట్యాంక్​బండ్​లోని హరిత రెస్టారెంట్​లో పిండివంటకాల స్టాల్స్​ను పర్యాటక కార్పొరేషన్​ ఛైర్మన్​ భూపతిరెడ్డి, ప్రారంభించారు. నిర్వాహకులు ప్రత్యేక మిఠాయిలతో పాటు, సంప్రదాయ వంటకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు.

చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం

పిండి వంటకాల తయారీని చిన్న పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పర్యాటక అభివృద్ధి శాఖ ఛైర్మన్​ భూపతిరెడ్డి అన్నారు. స్వచ్ఛమైన రుచుల వల్ల ఆరోగ్యంగా ఉంటామని అభిప్రాయపడ్డారు. పుల్లారెడ్డి మిఠాయిలు ఏ విధంగా విదేశాలకు ఎగుమతి చేసేవారో... అలాగే తెలంగాణ వంటకాలు సైతం ఎగుమతి చేసేలా పర్యాటక శాఖ కృషి చేస్తోందని ఎండీ మనోహర్​ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'సమష్టి కృషితో బోనాలను ఘనంగా నిర్వహిద్దాం'

ABOUT THE AUTHOR

...view details