తెలంగాణ

telangana

ETV Bharat / state

TPAD: అమెరికాలో తెలుగు వారి వనభోజనం.. చూసొద్దాం రండి - వనభోజనాలు

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌(TPAD) ఆధ్వర్యంలో డల్లాస్​లో వనభోజనాలు నిర్వహించారు. గత మూడు నెలల్లో బ్లడ్ డ్రైవ్, వ్యాక్సిన్ డ్రైవ్, ఫుడ్ డ్రైవ్ రూపంలో మూడు సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టి, ఈసారి డల్లాస్​లోని తెలుగు వారి కోసం వనభోజనాలు నిర్వహించింది.

TPAD: అమెరికాలో తెలుగు వారి వనభోజనం.. చూసోద్దాం రండి
TPAD: అమెరికాలో తెలుగు వారి వనభోజనం.. చూసోద్దాం రండి

By

Published : Jun 5, 2021, 9:58 PM IST

Updated : Jun 5, 2021, 10:16 PM IST

ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడికి వెళ్లినా మన సంస్కృతి మాత్రం మరిచిపోవడం లేదు. ఎక్కుడున్నా మన తెలుగు పండుగలు చేసుకుంటున్నారు. తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌(TPAD) ఆధ్వర్యంలో డల్లాస్​లో వనభోజనాలు నిర్వహించారు. గత మూడు నెలల్లో బ్లడ్ డ్రైవ్, వ్యాక్సిన్ డ్రైవ్, ఫుడ్ డ్రైవ్ రూపంలో మూడు సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టి, ఈసారి డల్లాస్​లోని తెలుగు వారి కోసం వనభోజనాలు నిర్వహించింది.

మహిళల సందడి
సరదాగా..

బిగ్​ బారెల్​ రాంచ్​ వారి అబేరీ అనే సిటీలోని పచ్చిక బయళ్లతో కూడిన విశాలమైన ఫార్మ్​లో ఈ కార్యక్రమం జరిగింది. వినాయకుని పూజతో మొదలైన ఈ కార్యక్రమం తెలంగాణ వంటల ఘుమఘుమలు, అటపాటలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీపీఏడీ(TPAD) అధ్యక్షుడు మామిడి రవికాంత్, ఉపాధ్యక్షులు కన్నయ్యగారి రూప, కోఆర్డినేటర్​ వేముల శ్రీధర్​ పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన సమాజ సంస్థగా, పేదలకు సహాయం చేస్తూ, మన సంస్కృతి కాపాడే కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు.

డల్లాస్​లో వనభోజనాలు
ఉట్టిపడిన తెలుగుదనం

ఇదీ చదవండి:TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు

Last Updated : Jun 5, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details