parents on inter results : ఇవాళ విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (Telangana Parents Association) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయించాయని ఆ సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.పద్మారెడ్డి పేర్కొన్నారు. కనీస మార్కులు వద్దనుకునే వారికి మరోసారి పరీక్ష నిర్వహించాలన్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు వెంటనే భరోసా కల్పించాలన్నారు.
parents on inter results: 'వాళ్లను పాస్ చెయ్యండి.. లేదంటే మరోసారి పరీక్షలు పెట్టండి' - ఇంటర్ రిజల్ట్స్ 2021
parents on inter results: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గడంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి ఉత్తీర్ణులను చేయాలని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.పద్మారెడ్డి డిమాండ్ చేశారు.
![parents on inter results: 'వాళ్లను పాస్ చెయ్యండి.. లేదంటే మరోసారి పరీక్షలు పెట్టండి' tpa on inter results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13926421-161-13926421-1639661039324.jpg)
tpa on inter results
Inter Results 2021: కొవిడ్ పరిస్థితుల వల్ల సరైన బోధన లేకపోవడం... సకాలంలో పరీక్షలు జరపకపోవడం వల్లే ఉత్తీర్ణత తగ్గిందని టీపీఏ విశ్లేషించింది. పదోతరగతిలో పది జీపీఏ వచ్చిన కొందరు విద్యార్థులు కూడా ఉత్తీర్ణులు కాలేకపోయారని నారాయణ, పద్మారెడ్డి పేర్కొన్నారు. వీటన్నింటినీ ఇంటర్‌బోర్డు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:Inter results: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల