రాష్ట్ర వ్యాప్తంగా 905 సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏకగ్రీవంగా 157 సంఘాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 748 సంఘాలకు ఇవాళ జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. మెుత్తంగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో పోలీసులు ఒక వర్గానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా బోరోలులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా హాలియాలోని కొత్తపల్లి కేంద్రంలో ఓ రైతుపై ఎస్ఐ వీర రాఘవులు చేయిచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.