ఇండోనేషియాలోని బాలిలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వార్షిక సదస్సులో మిషన్ కాకతీయపైసీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే ప్రజెంటేషన్ ఇచ్చారు. పథకం ఉద్దేశాలు, తెలంగాణలో గతంలో ఉన్న గొలుసుకట్టు చెరువుల విధానం, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ధృడసంకల్పంతో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యుల్ని చేసి విజయవంతం చేశారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయను సర్వత్రా హర్షించటంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు లభించాయని శ్రీధర్ దేశ్ పాండే వెల్లడించారు.
మిషన్ కాకతీయ..తెలంగాణ భాగ్యరేఖ
చిన్ననీటి వనరులకు పూర్వవైభవం తేవాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి పూర్తి విజయవంతం చేసినట్లు సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే ఇండోనేషియా బాలిలో జరుగుతున్న సదస్సులో వెల్లడించారు.
మిషన్ కాకతీయ..తెలంగాణ భాగ్యరేఖ