తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల తర్వాతే నియమిత పదవులు - తర్వాతే నియమిత పదవులు

మున్సిపల్​ ఎన్నికల పోరు ముగిశాకే నియమిత పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో నియమిత పదవులు 40 వరకు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు పొందలేని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు పదవులపై ఆశతో ఉన్నారు.

మున్సిపల్​ ఎన్నికల తర్వాతే నియమిత పదవులు

By

Published : Jul 14, 2019, 5:06 AM IST

Updated : Jul 14, 2019, 6:59 AM IST

మున్సిపల్​ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వంటివి ముగిశాక వచ్చే నెల 15 తర్వాత నియమిత పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల ఛైర్మన్లు, మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్, బాలల పరిరక్షణ కమిషన్​ ఛైర్మన్లు తదితర నియమిత పదవులు 40 వరకు ఖాళీగా ఉన్నాయి. వీటికోసం తెరాసలో భారీ ఎత్తున పోటీ ఉంది. ఇప్పటికే కొందరు నేతలు సీఎంను అభ్యర్థించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​కు వినతిపత్రాలు ఇస్తున్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లను ఆశించి పొందలేకపోయిన వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు ఈ పదవులపై ఆశతో ఉన్నారు. ఇటీవల పార్టీ పరిశోధన, విశ్లేషణ విభాగం కోసం ఎంపికలు చేపట్టగా దాదాపు వంద మందికి పైగా పోటీ పడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం తెరాస సభ్యత్వ నమోదు నడుస్తోంది. తర్వాత పార్టీ గ్రామ, డివిజన్​, మండల కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటివారంలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 15 నాటికి ఎన్నికలు ముగిసే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్​ నియమిత పదవులపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. పార్టీ నేతలు ఎవరెలా పనిచేస్తున్నారనే దానిపై అధిష్ఠానం దృష్టి సారించింది.

నియమిత పదవుల్లో సీఎం ఆచితూచి అవకాశాలు ఇవ్వనున్నారని తెలిసింది. వివిధ ఎన్నికలు, సభ్యత్వ నమోదులో కష్టపడి పనిచేసిన వారిని ఎంపిక చేసే వీలుంది. వివిధ అంశాల్లో తమ విధులను సరిగా నిర్వర్తించని వారిపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరు ప్రభుత్వ సలహాదారులకు మళ్లీ కొనసాగించే అవకాశం ఇవ్వని విషయం తెలిసిందే. కొందరు కార్పొరేషన్ల ఛైర్మన్లకు కూడా పొడగింపు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి : మంత్రి ఈటల రాజేందర్​కు నిరసన సెగ

Last Updated : Jul 14, 2019, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details