ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్‌-1 ప్రకటనపై కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం - మరీ చిక్కుముడి వీడేదెలా? - New Govt on TSPSC Job Notifications

Telangana New Government on Group 1 Notification : రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఇప్పటికే 503 పోస్టులతో కూడిన ప్రకటనపై రాష్ట్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 7:41 PM IST

Telangana New Government on Group 1 Notification : తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనపై నూతన సర్కార్ నిర్ణయం కీలకంగా మారనుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. 503 పోస్టులతో కూడిన ఈ ప్రకటనపై రాష్ట్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గత సంవత్సరం అక్టోబరులో నిర్వహించినగ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు (Telangana Group 1 Prelims)2.8 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో ఈ ఏడాది జూన్‌లో టీఎస్‌పీఎస్సీ పునఃపరీక్ష నిర్వహించింది. దీనికి 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం పరీక్ష రద్దుచేయాలని తీర్పు వెలువరించింది.

దీన్ని పునఃసమీక్షించాలంటూ టీఎస్‌పీఎస్సీ (TSPSC) సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొత్త సర్కార్ 2024 ఫిబ్రవరి 1న జారీచేసేందుకు ప్రస్తుత నోటిఫికేషన్‌పై నిర్ణయం కీలకం కానుంది. ఈ నోటిఫికేషన్‌ రద్దుచేసి, కొత్తగా ఇవ్వడమా? అదనపు ఉద్యోగాలను గుర్తించడమా? అనేది వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్‌ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌ జారీచేయాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుని, హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

TSPSC Appeal Hearing on Group 1 Cancel : బయోమెట్రిక్ పాటించకపోవడం వల్ల అభ్యర్థులకు నష్టంలేదు: హైకోర్టులో ఏజీ

Notifications Issued by TSPSC at Various Stages :మరోవైపు గత సర్కార్ జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో హాస్టల్‌ వెల్ఫేర్‌, గ్రూప్‌-3 అధికారుల పోస్టులకు ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాలేదు.గ్రూప్‌-2 పరీక్షకు (Telangana Group 2 Exam) షెడ్యూల్ జారీ అయినా పరీక్ష రెండుసార్లు వాయిదాపడింది.

వివిధ నోటిఫికేషన్ల పరిస్థితి ఇదీ

గ్రూప్‌-2:దాదాపు 783 పోస్టులున్న గ్రూప్‌-2 పరీక్ష తేదీలను అధికారులు రెండుసార్లు రీ షెడ్యూల్‌ చేశారు. జనవరిలో పరీక్ష జరగాల్సి ఉంది.

గ్రూప్‌-3:గ్రూప్‌-3 సర్వీసుల కింద 1380కి పైగా పోస్టులతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీచేసింది. కానీ ఇప్పటివరకు పరీక్ష తేదీలను వెల్లడించలేదు.

గ్రూప్‌-4 :మొత్తం 8039 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. దీనికి 9.51 లక్షల మంది దరఖాస్తు చేయగా, 7.62 లక్షల మంది పరీక్ష రాశారు.పరీక్ష తుది కీ వెల్లడైంది.

పోలీసు, యూనిఫాం సర్వీసులు : యూనిఫాం సర్వీసుల కింద 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇందులో 587 ఎస్‌ఐ స్థాయి పోస్టుల తుది నియామకాలు పూర్తయ్యాయి. ఎంపికైన వారు శిక్షణలో ఉన్నారు. కానిస్టేబుల్‌ పోస్టుల తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే న్యాయవివాదం కారణంగా వైద్యపరీక్షలు నిలిచిపోయాయి.

TSPSC Appeal Petition Against Group 1 Prelims Cancellation : అప్పీల్​ పిటిషన్​ వేసేందుకు సిద్ధమవుతోన్న TSPSC.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఏఈఈ) :ప్రభుత్వ విభాగాల్లో 1540 ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, అగ్రికల్చరల్‌ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ సంవత్సరంలో తొలుత జరిగిన పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో రెండోసారి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల తుది కీ వెల్లడైంది. అభ్యర్థుల మార్కులు, ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ పోస్టులు :ఈ విభాగాల్లో మొత్తం 355 పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. తుది కీ లు సిద్ధమయ్యాయి.

జూనియర్‌ లెక్చరర్లు: ఇంటర్‌, పాలిటెక్నిక్‌ విద్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు సెప్టెంబరులో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ వెల్లడైంది. తుది కీలు ఇంకా ఖరారు కాలేదు.

సంక్షేమ గురుకులాలు : బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మొత్తం 9210 ఉద్యోగాలకు దాదాపు 2.6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు ఆగస్టు నెలలో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించి తుది కీ వెల్లడైంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల నుంచి జోన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులకు సంబంధించి ఆప్షన్లు తీసుకుంటున్నారు.

వైద్య విభాగం :వైద్య విభాగంలో వైద్య పోస్టుల భర్తీ పూర్తయింది. దాదాపు 5204 స్టాఫ్‌ నర్సుల పోస్టులకు సంబంధించి రాతపరీక్షలు పూర్తయి మెరిట్‌ జాబితా వెల్లడైంది. దాదాపు 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) పోస్టులకు దరఖాస్తులు స్వీకరించినా పరీక్ష ఇంకా పూర్తికాలేదు.

పాఠశాల విద్య :పాఠశాల విద్యలో 9500 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తే 5089 ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనకు 1.76లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష ఇంకా పూర్తికాలేదు.

పంచాయతీరాజ్‌ శాఖ :పంచాయతీరాజ్‌ శాఖలో గ్రూప్‌-4 సర్వీసుల కింద దాదాపు 1000 వరకు ఉద్యోగాలను తొలుత గుర్తించి గ్రూప్‌-4 ప్రకటనలో చేర్చారు. సమగ్ర ప్రకటనలో ఈ విభాగం నుంచి పేర్కొన్న ఉద్యోగాలను ఉపసంహరించారు. పంచాయతీ విభాగంలో పోస్టులపై ఆ శాఖ నుంచి స్పష్టత రాలేదు.

Revanthreddy on TSPSC Board : టీఎస్​పీఎస్సీ బోర్డు.. రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది : రేవంత్​రెడ్డి

TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details