తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త మంత్రులు - సీఎం కేసీఆర్​ కసరత్తు

రాష్ట్రంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎంగా కేసీఆర్​ ప్రమాణం చేసిన దాదాపు 66 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది.

గవర్నర్​ నరసింహన్​

By

Published : Feb 19, 2019, 5:29 AM IST

Updated : Feb 19, 2019, 12:31 PM IST

నూతన మంత్రుల జాబితా
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు రాజ్​ భవన్​లో పది మంది కొత్త మంత్రులతో గవర్నర్​ నరసింహన్​ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డికి ఆర్థిక శాఖ, ఎర్రబెల్లి దయాకర్​రావుకు వ్యవసాయ శాఖ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​కు పౌర సరఫరాల శాఖ కేటాయించనున్నట్లు తెలిసింది. నీటి పారుదల, పంచాయతీ రాజ్​ శాఖలు​ తన వద్దనే ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

గులాబీ దళపతి సుదీర్ఘ కసరత్తు
మంత్రి వర్గ కూర్పుపై గులాబీ దళపతి సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, అనుభవం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తుది జాబితా రూపొందించారు. పాత జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం తప్ప అన్నీ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం శాఖల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి.
రాజ్​భవన్​లో ఏర్పాట్లు
రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. కొత్త మంత్రులు ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యులతో మాత్రమే రావాలని సీఎం కేసీఆర్​ సూచించినట్లు సమాచారం.
Last Updated : Feb 19, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details