తెలంగాణ

telangana

'ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు ఇరు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించాలని ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆర్.క్రిష్ణయ్య డిమాండ్​ చేశారు. తెలంగాణ, ఆంధ్రా విడిపోయి అరేండ్లయినా సమస్య ఇంకా తీరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఉమ్మడి సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించారు.

By

Published : Jan 17, 2021, 7:28 PM IST

Published : Jan 17, 2021, 7:28 PM IST

Joint meeting of employees
ఉద్యోగుల ఉమ్మడి సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి అరేండ్లయినా ఉద్యోగుల సమస్య ఇంకా తీరలేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆర్.క్రిష్ణయ్య అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

ఏపీలో పనిచేస్తున్న వారి సమస్యలు మానసిక, అస్థిత్వ కోణంలో చూడాలని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల స్థానిక, మల్టీ జోనల్, జిల్లా ఉద్యోగుల ఉమ్మడి సమావేశాన్ని.. తెలంగాణ నేటివ్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇక్కడెందుకు ఆలస్యం..

ఝార్ఖండ్, ఛత్తీస్​గఢ్​లు ఏర్పడినప్పుడు ఏడాదిలో ఉద్యోగుల సమస్య పరిష్కరించారని, ఇక్కడెందుకు ఆలస్యమవుతోందని ఆర్.క్రిష్ణయ్య ప్రశ్నించారు. తెలంగాణలో 2.50 లక్షలు, ఏపీలో 2లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆస్తులు, వనరులు కేంద్రం పంపకం చేయాలని సూచించారు.

ఇద్దరు సీఎంలు మంచి స్నేహితులు. ఈ విషయం తప్ప అన్నీ చర్చించుకుంటారు. నక్సలైట్లతో చర్చలు జరిపారు. అంతకన్నా ఈ సమస్య కష్టమేం కాదు. తమ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. తామూ తెలంగాణ బిడ్డలమే. ఇక్కడే చదువుకున్నాం. ఎప్పటికైనా ఇక్కడికే రావాలనేది తమ కోరిక. -ఆర్.క్రిష్ణయ్య, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు

ఇదీ చూడండి:పరిహారం కోసం ఆర్డీఓ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం!

ABOUT THE AUTHOR

...view details