హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆరు ఆంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 3, ప్రభుత్వ విప్ బాల్క సుమన్-2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు-1 ఆంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు.
కొవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్‌లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - నిర్మల్‌లో కొవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్‌లు
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ప్రగతి భవన్లో.. ఆరు ఆంబులెన్స్‌లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందేలా ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్ సహా అన్ని సౌకర్యాలుంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కొవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్‌లు
కరోనా రోగులకు చికిత్స అందేలా ఆక్సిజన్, వెంటిలేటర్ సహా ఆంబులెన్స్‌లో అన్ని సౌకర్యాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిర్మల్, మంచిర్యాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ ఆంబులెన్స్‌లు ఉపయోగపడతాయని వెల్లడించారు.