ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సమ్మె విషయంలో కేంద్రం తప్పకుండా జోక్యం చేసుకుంటుందని.. కార్మికులకు న్యాయం జరిగే వరకు భాజపా అండగా ఉంటుందన్నారు. ఇది కార్మికుల విజయంగా ఆయన అభివర్ణించారు. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ కన్న బిడ్డలుగా భావించి చర్చలకు ఆహ్వానించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా వారిని విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. వారికి జీతాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
కార్మికుల మనోగతాన్ని తెలుసుకునేందుకు మరోసారి చర్చలు జరిపి అశ్వత్థామ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్, సోయం బాపూరావు, అర్వింద్ కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీలు పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకుంటుంది: బండి సంజయ్ - ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని దిల్లీలో కలిశారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విన్నవించుకున్నారు.
ఆర్టీసీ కార్మికులకు భాజపా అండగా ఉంటుంది: బండి సంజయ్