తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైవర్లకు సాయం చేయాలి: తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్

రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లల్లో టాక్స్​లు కడుతున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని ఏఐటీయూసీ భవన్​లో యూనియన్ ఆధ్వర్యంలో​ సమావేశం ఏర్పాటు చేశారు.

డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలి : తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్
డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలి : తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్

By

Published : Jun 9, 2021, 1:53 PM IST

హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని ఏఐటీయూసీ భవన్​లో తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లల్లో టాక్స్​లు కడుతున్నా తమను పట్టించుకోవడం లేదని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు గౌడ్ అన్నారు. గత ఏడాది నుంచి డ్రైవర్ల కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులుపడుతున్నాయన్నారు. ఫైనాన్స్​లో తీసుకున్న వాహనాలకు ఈఎంఐలు కట్టలేక ఫైనాన్సర్ల వేధింపులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. టాక్సీ డ్రైవర్లకు తొలిగించిన రేషన్ కార్డులను తిరిగి మంజూరు చేయాలని కోరారు.

ఏపీలో అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం తరహా తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లకు తక్షణ సహాయం కింద రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలన్నారు. కరోనాతో, ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే... రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరమూ సమ్మెకు దిగుతాని హెచ్చరించారు. ఇదీ చదవండి:CORONA: కుటుంబాల్ని కాటేసిన కరోనా.. అనాథలైన చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details