Telangana MLC Elections 2024 : గత డిసెంబరు 3వ తేదీన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలతో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలపై ఎన్నికల షెడ్యూలును విడుదల చేస్తూ జనవరి 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లుగా తెలుపు, గులాబీ రంగుల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నట్లుగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈసీ ప్రతికా ప్రకటనకు సవాలు చేస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం రోజున విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నియోజకవర్గం కోటా కింద ఎన్నుకున్నారని కోర్టుకు తెలిపారు. ఖాళీ అయిన స్థానాలకు అధికణ (4) కింద ఒకే ఓటు బదలాయింపు పద్ధతిలో ఎన్నిక నిర్వహించాల్సి ఉందని చెప్పారు.
EC Issued Notification for MLC Elections : ఎన్నికల సంఘం రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలను(MLC Elections) నిర్వహించడం ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని రోహిత్గి పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ కాలేదని అందువల్ల ఇది న్యాయ సమీక్షకు అడ్డంకి కాదని అన్నారు. అడ్డంకులను తొలగించి ఎన్నికలు సాఫీగా నిర్వహించడంలో భాగంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు పేర్కొందని తెలిపారు.
లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహం - అత్యధిక స్థానాలే లక్ష్యంగా దిశానిర్దేశం