తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

Telangana MLA Quota MLC by Election 2024 Notification Released : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. అలాగే ఈనెల 19న నామినేషన్‌ల పరిశీలన చేస్తారు.

MLC Elections Telangana
MLC Elections

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 11:35 AM IST

Telangana MLA Quota MLC by Election 2024 Notification Released :రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19న నామినేషన్లు పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, 29న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు.

రెండు ఎమ్మెల్సీలకు వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వేర్వేరు ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ఖాతాలోకే రెండు ఎమ్మెల్సీలు చేరనున్నాయి. రెండు ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్‌లో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. టికెట్ త్యాగం చేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్‌, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్, హర్కల వేణుగోపాల్ రావు, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో మస్కతీ డైరీ యాజమాని అలీ మస్కతి, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్ పేర్లు ఉన్నాయి. ఓడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్‌లు ఉన్నారు. పాడి కౌశిక్‌ రెడ్డి, కడియం శ్రీహరిల రాజీనామాలతో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details