MLA Kota MLC Election Schedule Release: తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 29వ తేదీతో ఖాళీ కానున్న మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
మార్చి 13 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 వ తేదీన పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు ఉంటుంది. మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఏపీలో 7 స్థానాలకు షెడ్యూల్ విడుదల : ఏపీలోను 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 6 న నోటిఫికేషన్ వెలువరించనున్న ఈసీ.. మార్చి 13 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. మార్చి 14 న పరిశీలన, మార్చి 23న పోలింగ్ నిర్వహించి అదే రోజున కౌంటింగ్ చేపట్టనుంది. ఎమ్మెల్సీల్లో నారా లోకేశ్, భగీరథరెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్య నారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డిల పదవీకాలం మార్చి నెలాఖరులో ముగియనుంది.