గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు ఎన్నో పాటలను ఆలపించి ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర మంత్రులు అన్నారు. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, లక్షలాది బాలు అభిమానులకు ఇది తీరని లోటని మంత్రులు విచారం వ్యక్తం చేశారు.
గగనానికేగిన గానగంధర్వునికి రాష్ట్ర మంత్రుల సంతాపం
ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గగనానికేగిన గానగంధర్వునికి రాష్ట్ర మంత్రుల సంతాపం
అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలు లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాఠోడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండిఃబాలు పార్థివదేహానికి అశ్రునివాళి- భారీగా తరలిన జనం