తెలంగాణ ప్రభుత్వం 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. హైదరాబాద్ వెస్ట్‌మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఆహిరి యాదవ్ వర్గానికి మంత్రి తలసాని ధ్రువీకరణ పత్రం అందజేత
ఇటీవలే తెలంగాణ సర్కార్ 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
మంత్రి తలసాని
తిరుమలగిరి మండల పరిధిలోని బోయిన్‌పల్లికి చెందిన అరుణ్.. మంత్రి చేతుల మీదుగా బీసీ-డీ(ఆహిరి యాదవ కులం) ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
- ఇదీ చూడండి :పరువు హత్య : అల్లుణ్ని చంపించిన మామ