తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం సహాయనిధితో మెరుగైన వైద్య సేవలు' - సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం పొంది అనేక మంది మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Telangana minister talasani distributed cm relief fund cheques
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తలసాని

By

Published : Sep 10, 2020, 3:17 PM IST

హైదరాబాద్​ వెస్ట్​మారేడ్​పల్లిలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. 2.50 లక్షల రూపాయల చెక్కును విద్యావతి అనే మహిళకు అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసాయం పొంది అనేక మంది మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి అన్నారు. తనకు ఆర్థిక సాయం మంజూరు చేయించేందుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​కు విద్యావతి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details