Candidates Meetings with Telangana Migrant Voters :ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటు కీలకమే. రాష్ట్రంలోనివి గాకుండా.. వలస ఓట్లు ముఖ్యమే. ఇప్పుడు అభ్యర్థుల కన్ను వలస ఓటర్లపై పడింది. వారిని గుర్తించి.. కలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ(TS Elections 2023) రాకముందు కరవు పీడిత జిల్లాల నుంచి ప్రజలు.. జీవనోపాధి కోసం పుణె, ముంబయి, భివండికి వలస వెళ్లారు. పిల్లల చదువులు, మెరుగైన జీవనానికి హైదరాబాద్ నగరానికి తరలి వెళ్లారు. అభ్యర్థులు ఈ ఓటర్లను గుర్తించి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Migrant Voters In Telangana : వలస ఓటర్లపై నేతల కన్ను.. వారి వివరాల సేకరణ కోసం ప్రత్యేక బృందాలు
Telangana Assembly Elections 2023 : గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు తీసుకుని.. ఆయా ఓటర్ల చిరునామా, వివరాలు తెలుసుకుంటున్నారు. వారిని ఫోన్లలో సంప్రదిస్తూ.. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ రోజున.. గ్రామానికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి వలస ఓటర్లు అధికంగా ఉన్న పుణె, ముంబయికు వెళ్లి వారితో సమావేశమయ్యారు.
Telangana Migrant Voters :వచ్చే వారం రోజుల్లో మరోమారు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. గ్రామాలకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వలస ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. ఓటుహక్కును గ్రామాల్లోనే వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మరిన్ని సమావేశాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.