Telangana Medical Students Stipend Increase : వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. హౌస్‌సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ పెరిగింది. గతంలో ఉన్న మొత్తంపై 15 శాతాన్ని పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన స్టైఫండ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ స్టైఫండ్ పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు వైద్య విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నోసార్లు ఈ విషయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతున్న.. ఈసారి అందుకు తగిన విధంగా మంచి నిర్ణయం తీసుకున్నారని వైద్య విద్యార్థులు వాపోయారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ : రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య శాఖ డే రోజున కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీని ఆరోగ్య శాఖ పంపిణీ చేయనుంది. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. వెంటనే పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల నిర్మాణ, మరమ్మతు పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే సిద్ధమైన బస్తీ, పల్లె దవాఖానాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంపై ఆరా తీసిన మంత్రి.. 80 రోజుల్లో కంటి వెలుగు ద్వారా 1.50 కోట్ల మందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లను గతంలోనూ పంపిణీ చేశారు. ఈ సారి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మళ్లీ పంపిణీకి ప్రభుత్వం కట్టుబడింది.