తెలంగాణ

telangana

ETV Bharat / state

గుజరాత్‌ మార్క్‌ఫెడ్‌ వ్యాపార సూత్రాలు తెలంగాణలో!! - గుజరాత్‌ మార్క్‌ఫెడ్‌ తెలంగాణ మార్క్‌ఫెడ్‌ సమావేశం

గుజరాత్‌ మార్క్‌ఫెడ్‌ విజయ రహస్యం తెలుసుకొని, దానిని రాష్ట్రంలో అమలు చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలంగాణ మార్క్ఫెడ్ ఛైర్మన్‌ మార గంగారెడ్డి అన్నారు. దీని ద్వారా రైతులకు ఆసరాగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపార విస్తరణలో భాగంగా ఆ సంస్థ ఛైర్మన్‌ని బృంద సభ్యులు కలిశారు.

telangana markfed meeting with gujarat markfed
గుజరాత్‌ మార్క్‌ఫెడ్‌ వ్యాపార సూత్రాలు తెలంగాణలో!!

By

Published : Nov 8, 2020, 11:40 AM IST

వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి బృందం... గుజరాత్ మార్క్ఫెడ్ ఛైర్మన్ దిలీప్ సంగాతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గుజరాత్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రధాన రంగాలైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారాల గురించి తెలుసుకున్నారు. తాము తెలంగాణలో చేపడుతున్న వ్యాపారాల గురించి ఎండీ భాస్కరచారి వివరించారు. ఐదు సంవత్సరాలుగా లాభాలు గడిస్తోందని దిలీప్‌ సంగాకి చెప్పారు. వారం రోజుల తర్వాత మార్క్‌ఫెడ్‌ బృందం.. రాష్ట్రంలోని విత్తన శుద్ధి కర్మాగారం, ఎరువుల తయారీ కేంద్రాలను సందర్శించనున్నాయి.

గుజరాత్ కంపెనీ చేపడుతున్న వ్యాపార విజయ రహస్యాలు, కార్యకలాపాల గురించి తెలుసుకొని రాష్ట్రంలో అమలు చేయడమే ముఖ్య ఉద్దేశమని ఛైర్మన్‌ మార గంగారెడ్డి అన్నారు. ఆ రాష్ట్రంలో వారి ఉత్పత్తులైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు డిమాండ్ బాగా ఉందని... ఇతర దేశాలకు వారి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఇదే విధానం రాష్ట్రంలో అమలు పరిచి రైతులకు సేవ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మార్కెట్లు, జిన్నింగ్‌లలో కాంటాల నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ

ABOUT THE AUTHOR

...view details