ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ పురస్కరించుకుని కనీస మద్దతు ధరల కింద శనగ పంట సేకరణ కోసం రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థను ప్రభుత్వం నియమించింది. త్వరలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న వేళ.. 1,03,661 మెట్రిక్ టన్నుల శనగలు సేకరించేందుకు సర్కారు అనుమతిచ్చింది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
'శనగ' సేకరణ కోసం నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర మార్క్‌ఫెడ్ - telangana markfed latest news
కనీస మద్దతు ధరల కింద శనగ పంట సేకరణ కోసం రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థను ప్రభుత్వం నియమించింది. 1,03,661 మెట్రిక్ టన్నుల శనగలు సేకరించేందుకు సర్కారు అనుమతిచ్చింది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర నోడల్ ఏజెన్సీ తరఫున కనీస మద్దతు ధర కింద శనగల కొనుగోలు కోసం ఎన్‌సీడీసీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.578.47 కోట్ల రుణం మంజూరు కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా 51,325 మెట్రిక్ టన్నులు సేకరించడానికి అనుమతిచ్చిన నేపథ్యంలో.. 1,03,661 మెట్రిక్ టన్నులు సేకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అందుకోసం అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. శనగల సేకరణలో ఏదైనా నష్టం సంభవిస్తే.. ఆ సొమ్ము ప్రభుత్వం నోడల్ ఏజెన్సీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర మార్క్‌ఫెడ్ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: భైంసా అల్లర్ల ఘటనలో 42 మంది అరెస్ట్: ఐజీ నాగిరెడ్డి
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు