Telangana Congress Leaders Delhi Tour : దేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇవాళ, రేపు రెండు రోజుల పాటు దిల్లీలో అధిష్ఠానం సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు, సీఎల్పీ నేతలకు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లకు పార్లమెంట్ ఇంఛార్జ్‌లకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది.
Telangana Congress Leaders Attend AICC Meeting in Delhi : అయితే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఆయన దిల్లీ పర్యటన ఖరారు కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ
Congress Focus on Parliament Poll 2024 :మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోగ్యరీత్యా ఈ సమావేశానికి హాజరుపై స్పష్టత లేదు. మిగిలిన వారంతా ఇవాళ ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. దీపాదాస్ మున్షీ మాత్రం ఉదయం 7 గంటలకు హస్తినకు పయనమయ్యారు. జీవన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు బయల్దేరనున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Poll 2024)అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ నాయకులు దిశనిర్దేశం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.