Telangana Liberation Day Celebrations 2023 at Parade Grounds : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. తొలుత అమిత్ షా (Amit Shah) పోలీస్ అమరవీరుల స్మృతిస్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలోనే సాయుధ బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించారు.
Amit Shah Reached Hyderabad : హైదరాబాద్‌లో అమిత్ షా.. పీవీ సింధుతో భేటీ..
Telangana Liberation Day Celebrations 2023 : ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలైన బతుకమ్మ, బోనాలు, పోతురాజులు, ఒగ్గుడోలు విన్యాసాలు, కోలాటం, తప్పెట, థింసా, లంబాడ నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను అమిత్ షాసన్మానించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఎన్నికల వేళ జరుగుతోన్న వేడుకల్లో అమిత్ షా ప్రసంగంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. వేడుకల అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షా.. అక్కడి నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
Amit Shah at TS Liberation Day celebrations : తెలంగాణ అమరవీరులకు అమిత్ షా ఘననివాళి
KishanReddy in Telangana Liberation Day : తెలంగాణ విమోచన దినోత్సవాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (KishanReddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ సమాధి చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అనేక మంది యోధులు భూమికోసం, భుక్తి కోసం స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం నిజాంకు ఎదురు నిలబడి పోరాటం చేశారని గుర్తు చేశారు. కానీ ఇవాల్టికీ స్వాతంత్య్ర వేడుకలను జరిపేందుకు హస్తం పార్టీ సిద్ధంగా లేదని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
విమోచనం కోసం మొదటిసారి గొంతెత్తిన పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ బాటలోనే బీఆర్ఎస్ కూడా విమోచన దినాన్ని విస్మరించిందని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని.. వీటి గురువు ఎంఐఎం అని ఆరోపించారు. హస్తం పార్టీ, భారత్ రాష్ట్ర సమితి తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.