రాష్ట్ర శాసనసభ సమావేశాలు పేదలకు, బడుగు బలహీనవర్గాలతోపాటు విద్యార్థులు రైతులకు నిరాశను మిగిల్చాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ వర్గాలకు గత కేటాయింపు కంటే... అదనంగా ఏమీ చేయలేదని పేర్కొన్నారు.
2017-18లో 2,72,763 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిచామని, నిన్న కాక మొన్న బడ్జెట్లో కూడా అదే ఫిగర్‌ను చదివారని వివరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయకుండా బలహీన వర్గాల ఆశల మీద నీళ్లు చల్లారని రావుల విమర్శించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లకు ఎప్పుడూ మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.