Council Chairman: శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక కోసం ఇవాళ ఎమ్మెల్సీలకు సమాచారం పంపనున్నారు. ఖాళీగా ఉన్న ఛైర్మన్ పదవికి ఎన్నికకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. అందుకు అనుగుణంగా ఎన్నిక తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు. ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నిక కోసం ముందురోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నిక తేదీలు, సమాచారం, ప్రక్రియను వివరిస్తూ అధికారులు ఇవాళ ఎమ్మెల్సీలకు సమాచారమిస్తూ లేఖలు పంపనున్నారు.
Council Chairman: మండలి ఛైర్మన్ పదవి ఎన్నికకు అనుమతిస్తూ గవర్నర్ ఆమోదం
Council Chairman: ఖాళీగా ఉన్న ఛైర్మన్ పదవికి ఎన్నికకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. అందుకు అనుగుణంగా ఎన్నిక తేదీని ఖరారు చేసి సభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు. ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు.
Council Chairman: మండలి ఛైర్మన్ పదవి ఎన్నికకు గవర్నర్ ఆమోదం
అటు మండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. గతంలో మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సుఖేందర్ రెడ్డి... ఇటీవల శాసనసభ కోటా నుంచి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు మరోమారు మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఛైర్మన్ ఎన్నిక అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక కూడా చేపట్టే అవకాశం ఉంది. డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: