మాజీ ప్రధానమంత్రి పీవీనరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ఇవాళ ఉభయసభలు తీర్మానం చేయనున్నాయి. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై శాసనపరిషత్తు, శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరతూ.. నేడు ఉభయసభల తీర్మానం - తెలంగాణ ఉభయసభల తీర్మానం
పీవీనరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ఉభయసభలో తీర్మానం చేయనున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై శాసనపరిషత్తు, శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
ఇదే సందర్బంలో పీవీకి సంబంధించి వివిధ తీర్మానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇవాళ కూడా రెండు సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నిన్నటి సభావ్యవహారాల సలహా సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయసభల ముందు ఉంచనున్నారు. వివిధ ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రంగారెడ్డి జిల్లాలో అంతిరెడ్డిగూడ గ్రామపంచాయతీ ఏర్పాటు కోసం ముసాయిదా నోటిఫికేషన్‌ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చదవండి:ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్