Telangana Leaders party Jumping : ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందికి మళ్లీ టికెట్లు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. అయినా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం, ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని బెదిరించడం,తమకు టికెట్ ఇవ్వాలని కోరడం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్(BRS) ప్రయత్నిస్తోంది. అవసరమైన నియోజకవర్గాల్లో బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Congress Leader Joins BRS : కొన్నాళ్ల కిందట భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం నియోజకవర్గ నాయకుడు తెల్లం వెంకట్రావు తాజాగా మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. భద్రాచలం నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈయన చేరినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. బీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల చేసేలోపే ఈయన చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
BRS Leaders Joining in Congress : 'కారు' దిగి.. 'చేయి' అందుకునేందుకు రెడీగా ఉన్న నేతలు వీళ్లే
BJP Leader Joins Congress in Telangana : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీజేపీ ఇన్‌ఛార్జిగా ఉన్న వినయ్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఈయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతం నుంచి ఆయన బలమైన అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావుతో పాటు గద్వాల జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సరిత, వనపర్తి నియోజకవర్గంలో ఎంపీపీ మేఘారెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కొందరు నాయకులు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన పలువురు నియోజకవర్గ లేదా ద్వితీయశ్రేణి నాయకులు అనేకచోట్ల ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు.