LAWCET EXAM 2022 : రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నేడు, రేపు లాసెట్, పీజీఎల్ సెట్ జరగనున్నాయి. ఇవాళ రెండు సెషన్లలో మూడేళ్ల ఎల్ఎల్బీ కోసం లాసెట్.. రేపు ఉదయం అయిదేళ్ల ఎల్ఎల్బీ కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం సెషన్ రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు పరీక్షలు ఉంటాయని కన్వీనర్ తెలిపారు.
LAWCET EXAM: నేటి నుంచి లాసెట్ .. ఒక నిమిషం ఆలస్యమైనా..
LAWCET EXAM: రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నేడు, రేపు లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇవాళ రెండు సెషన్లలో మూడేళ్ల ఎల్ఎల్బీ కోసం లాసెట్.. రేపు ఉదయం అయిదేళ్ల ఎల్ఎల్బీ కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని కన్వీనర్ స్పష్టం చేశారు.
ఎల్ఎల్బీ
ఈరోజు లాసెట్ కోసం తెలంగాణలో 38, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు.. రేపటి పరీక్ష కోసం రాష్ట్రంలో 32, ఏపీలో 4 కేంద్రాలను సిద్ధం చేశారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోసం 24,938 మంది.. అయిదేళ్ల ఎల్ఎల్బీకి 7507, ఎల్ఎల్ఎంకు 3093 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని కన్వీనర్ స్పష్టం చేశారు.