ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేసీఆర్ మార్కు కనిపిస్తుందన్నారు. రైతులకు, పేద ప్రజలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయల్దేరిన హరీశ్‌రావు.... బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.జెలెన్స్కీతో మాట్లాడనున్న మోదీరష్యా సైనిక చర్య కొనసాగుతున్న క్రమంలో మరోమారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. జెలెన్స్కీకి మోదీ ఫోన్ చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశంలో 5వేల దిగువకు కరోనా కేసులు దేశంలో కొత్తగా 4,362 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివారం 26,19,778 టీకా డోసులు పంపిణీ చేశారు.బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారంఆరేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హరియాణాలోని పానీపత్ జిల్లాలో ఆదివారం జరిగింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.యాదాద్రి ప్రసాదంలో గాజుముక్క యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి ప్రసాదం తయారీలో సిబ్బంది నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు వస్తోందని కొందరు వాపోతున్నారు. ఓ వ్యక్తికి పులిహోర ప్రసాదంలో గాజుసీసం ముక్క రావడం భక్తుల్లో కలవరం కలిగిస్తోంది. చిన్నపిల్లలు చూడకుండా ప్రసాదం తింటే వారి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తుశాసనసభ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో ప్రభుత్వం.. పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.మరో 135 మంది విద్యార్థుల రాక ఉక్రెయిన్ నుంచి మరో 135 మంది తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రానికి వచ్చారు. రాత్రి 11 గంటల వరకు 10 విమానాల్లో వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన విద్యార్థుల సంఖ్య 625కి చేరింది.కుప్పకూలిన దేశీయ మార్కెట్లుఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయంగా స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ (Sensex) 1413 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం బ్యారెల్ చమురు ధర 10డాలర్లకు పైగా పెరిగింది.యువ ప్లేయర్ల కోసం మేరీకోమ్ త్యాగం భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్, ఆసియన్ గేమ్స్ నుంచి తప్పుకుంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తన దృష్టంతా కామన్వెల్త్ గేమ్స్ మీద ఉన్నట్లు చెప్పింది.ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!This week release movies: కరోనా కారణంగా వాయిదా పడిన పెద్ద చిత్రాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ వద్దకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూసేయండి