Potato cultivation : రాష్ట్ర ఉద్యానశాఖ వినతి మేరకు తెలంగాణలో ఆలుగడ్డ సాగుకున్న అనుకూలతలపై సిమ్లాలోని కేంద్ర ఆలుగడ్డల పరిశోధనా సంస్థ (సీపీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. ఇక్కడి అనుకూల వాతావరణం ఉందని, ఇతర రాష్ట్రాల్లో ఆలుపైరుకు వచ్చే లేట్‌బ్లైట్, బ్యాక్టీరియల్ తెగులు కూడా తెలంగాణలో కన్పించలేదని గుర్తించారు. తొలుత ఇక్కడి రైతులకు అవసరమైన మేరకు ఆలు విత్తనోత్పత్తిని పెంచాలని సూచించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన వర్సిటీ పక్కనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) కేంద్రంలో ఆలు విత్తన పంటను ఉద్యానశాఖ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ‘కుఫ్రీ ఫుక్రాజ్, కుఫ్రీ హిమాలిని, గంగా, కుఫ్రీ మోహన్, సూర్య అనే ఐదు రకాల విత్తనాలను విజయవంతంగా సాగుచేసింది.
కొరత ఉంది.. సాగైతే కాసులు పండిస్తుంది
తెలంగాణలో ఆలుగడ్డ తలసరి వినియోగం సంవత్సరానికి 6.24 కిలోలుగా ఉంది. రాష్ట్ర అవసరాలకు ఏటా 2.04 లక్షల టన్నుల ఆలుగడ్డలు అవసరంకాగా, వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి కొనుగోలుకు వినియోగదారులు ఏటా రూ.403 కోట్లు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,906 ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగవుతుండగా, 47,169 టన్నుల దిగుబడి వస్తోంది. అవసరమైనంత పంట ఇక్కడే పండితే ఈ సొమ్మంతా ఇక్కడి రైతులు, వ్యాపారులకే వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ విశ్లేషించింది.
సీపీఆర్‌ఐ సిఫార్సులు ఇవీ