రాష్ట్రంలోని ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయుర్వేద, హోమియో, యునానీ, ప్రకృతి వైద్యం కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అఖిల భారత కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్కు అనర్హులని పేర్కొంది. ప్రైవేటు హోమియోపతి వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో సీట్లు భర్తీ ప్రక్రియను ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ తెలిపింది. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను చూడాలని పేర్కొంది.
రేపటి నుంచి ఆయుష్ కన్వీనర్ సీట్ల భర్తీ - ఆయుష్
రాష్ట్రంలోని ప్రైవేటు హోమియోపతి వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో సీట్లు భర్తీ ప్రక్రియను ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు కాళోజి ఆరోగ్య వర్సిటీ తెలిపింది.
రేపటి నుంచి ఆయుష్ కన్వీనర్ సీట్ల భర్తీ