తెలంగాణ

telangana

ETV Bharat / state

'అర్నబ్​ గోస్వామి అరెస్టు అప్రజాస్వామికం' - hyderabad news

రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్నబ్​‌ గోస్వామి అరెస్టు అప్రజాస్వామికమని పలువురు సీనియర్‌ పాత్రికేయులు మండిడ్డారు. ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

telangana journalist union meet on arnab goswamy arrest
'అర్నబ్​ గోస్వామి అరెస్టు అప్రజాస్వామికం'

By

Published : Nov 6, 2020, 11:22 AM IST

పాత్రికేయుడు అర్నబ్‌ గోస్వామి అరెస్టు అప్రజాస్వామికమని, వెంటనే ఆయనపై బనాయించిన కేసుల్ని ఎత్తేయాలని పలువురు సీనియర్‌ పాత్రికేయులు డిమాండ్‌ చేశారు. గోస్వామి అరెస్టును, అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. ఆయన అరెస్టు విషయంలో ప్రజాస్వామిక విలువల్ని కాలరాశారని విమర్శించారు.

తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో అర్నబ్‌ గోస్వామి అరెస్టును ఖండిస్తూ పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. యూనియన్​ అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్‌ పాత్రికేయులు సతీష్‌, అమరేందర్‌, ప్రజ్ఞా భారతి ప్రతినిధి కృష్ణ, సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే అణిచి వేస్తామని చెప్పకనే చెబుతున్నారని అన్నారు. ఈ అణచివేతకు రెట్టింపుగా చైతన్యం వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్నబ్​కు సంబంధం లేని కేసును తీసుకొచ్చి అరెస్టు చేశారని విమర్శించారు.

ఇవీ చూడండి: బాధ్యతను గాలికొదిలేస్తే... అంతే!

ABOUT THE AUTHOR

...view details