తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ ఎక్కడున్నారు?: కోదండరాం - సచివాలయం కూల్చివేత వార్తలు

సచివాలయం కూల్చివేతపై తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం స్పందించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త భవనం అవసరమా అని ప్రశ్నించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన సీఎం జాడలేకుండా పోయిందని పేర్కొన్నారు.

kodandaram
kodandaram

By

Published : Jul 7, 2020, 4:17 PM IST

Updated : Jul 7, 2020, 7:09 PM IST

రాష్ట్రం కరోనాతో అట్టుడికిపోతుంటే ప్రభుత్వమేమో సచివాలయం కూల్చివేతపై దృష్టి పెట్టిందని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన సీఎస్‌, డీజీపీ సచివాలయం కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారంటే ప్రభుత్వ పరిస్థితి అర్థమవుతోందని అన్నారు. ఆసుపత్రుల్లో కరోనా వైద్యం అందక ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి వైఖరి బాధాకరంగా ఉందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన సీఎం జాడలేకుండా పోయిందని తెలిపారు.

కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ ఎక్కడున్నారు?: కోదండరాం

విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులను కరోనాకు ఖర్చు చేయాలి. సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకు. జీతాలే ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం... వ్యక్తిగత ప్రతిష్ఠత కోసం మంచి భవనాలు కూల్చి కొత్తవి కట్టాలనుకోవడం అన్యాయం. ముఖ్యమంత్రి వైఖరిని తెజస తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలందరూ ఖండించాలి.

- ప్రొ.కోదండరాం, తెజస అధ్యక్షుడు

ఇదీ చదవండి :'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'

Last Updated : Jul 7, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details