రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెజస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 'స్వరాష్ట్రంలో యూనివర్సిటీలు' సదస్సుకు కోదండరామ్ హాజరయ్యారు.
యూనిర్శిటీలను నిర్లక్ష్యం చేయడమంటే సామాజిక తెలంగాణను పట్టించుకోకపోవడమేనని కోదండరామ్ అన్నారు. వీసీలను వెంటనే నియమించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆక్షేపించారు. యూనివర్శిటీలను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.