ఆరోగ్యం, ఆకలి, రైతాంగ సమస్యలు, వలస కూలీల రోదనలపై ప్రభుత్వ నిస్సహాయ స్థితికి వ్యతిరేకంగా పార్టీ కార్యాలయాలు, ఇళ్లల్లో మౌన దీక్ష చేయాలని తెజస శ్రేణులకు కోదండరాం సూచించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పార్టీ కార్యాలయంలో దీక్షకు కూర్చోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాల వరకు మౌన దీక్ష చేయనున్నారు.
నేడు తెజస అధ్యక్షుడు కోదండరాం మౌన దీక్ష - తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష
కొవిడ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. తెజస మౌన దీక్ష చేపట్టింది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం ఉదయం 10 గంటల 30 నిమిషాల దీక్షకు కూర్చోనున్నారు.
తెజస ఆధ్వర్యంలో మౌన దీక్ష